రాహుల్‌ విజయ్, మేఘా ఆకాష్‌ల మూవీ టైటిల్‌ ఖారారు | Megha Akash, Rahul Vijay Film Titled Maate Mantramu | Sakshi
Sakshi News home page

Megha Akash: రాహుల్‌ విజయ్, మేఘా ఆకాష్‌ల మూవీ టైటిల్‌ ఇదే

Published Wed, Jun 8 2022 8:26 AM | Last Updated on Wed, Jun 8 2022 8:26 AM

Megha Akash, Rahul Vijay Film Titled Maate Mantramu - Sakshi

రాహుల్‌ విజయ్, మేఘా ఆకాష్‌ జంటగా అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న సినిమాకి ‘మాటే మంత్రము’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మేఘా ఆకాష్‌ తల్లి బిందు ఆకాష్‌ సమర్పణలో ఎ. సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మిస్తున్నారు. కాగా రాహుల్‌ విజయ్‌ బర్త్‌ డే (జూన్‌ 7) సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. 

ఎ. సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట మాట్లాడుతూ– ‘‘గోవా నేపథ్యంలో జరిగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. సుశాంత్‌ రెడ్డి అందించిన కథ ఆసక్తిగా ఉంటుంది. మా సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్‌ రెడ్డి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement