Megha Akash And Rahul Vijay's New Film Title As Maate Mantramu - Sakshi
Sakshi News home page

‘మాటే మంత్రము’ అంటున్న మేఘ ఆకాష్‌

Jun 7 2022 5:11 PM | Updated on Jun 7 2022 6:47 PM

Megha Akash And Rahul Vijay New Film Title As Maate Mantramu - Sakshi

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను  కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి,  అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. 90 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి "మాటే మంత్రము" అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement