ఒలింపిక్ ఆరంభ వేడుకలకు మెగా ఫ్యామిలీ.. చిరంజీవి పోస్ట్ వైరల్! | Megastar Chiranjeevi Shares A Pic with Family From London Goes Viral | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మనవరాలు క్లీంకారతో మెగాస్టార్‌ దంపతులు.. పోస్ట్ వైరల్!

Jul 24 2024 5:57 PM | Updated on Jul 24 2024 7:26 PM

Megastar Chiranjeevi Shares A Pic with Family From London Goes Viral

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష కనిపించనుంది. ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ అడ్వెంచెరస్‌గా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా.. విశ్వంభర సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.

అయితే ప్రస్తుతం షూటింగ్‌ లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్‌లో విహరిస్తున్నారు. ఓ పార్క్‌లో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఒలింపిక్స్‌ ఆరంభ ఈవెంట్‌ కోసం పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement