Bholasankar Movie: మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. భోళాశంకర్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్

Megastar Bholasankar Movie Crazy Update For Mega Fans - Sakshi

Bhola Shankar Movie Release Date: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్‌'. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ  వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్‌ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‍డేట్‌ వచ్చేసింది. 

ఉగాది పర్వదినం సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. భోళాశంకర్‌ మూవీని ఆగస్టు 11, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top