'Bhola Shankar' Movie Twitter Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Bhola Shankar Twitter Review: ‘భోళా శంకర్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..

Aug 11 2023 7:01 AM | Updated on Aug 11 2023 8:21 AM

Bhola Shankar Movie Twitter Review And Rating In Telugu - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్‌. తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌ ఇది.  మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్‌, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత మళ్లీ చిరంజీవి మాస్‌ మూవీ చేస్తుండడంతో ‘భోళా శంకర్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 11)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది.

 దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘భోళా శంకర్‌’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు  ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రం బాగుందని ట్వీట్‌ చేస్తే.. మరికొంతమంది యావరేజ్‌ మూవీ అని కామెంట్‌ చేస్తున్నారు. కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. సెకండాఫ్‌లో బాస్‌ తెలంగాణ యాసలో ఇంకా సూపర్‌. ఖుషీ సీన్‌లో మెగాస్టార్‌ ఇరగ్గోట్టేశాడు. సెంటిమెంట్‌తో కూడా కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌లో సాంగ్స్‌, కామెడీ వర్కౌట్‌ అయింది. కానీ కొన్ని రొటీన్ ఓల్డ్‌ సీన్స్‌ ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ యావరేజ్‌. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు వేదాళంలో ఉన్నట్లే ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌’అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 


 

Advertisement
 
Advertisement
Advertisement