విజయ్‌కి షాకింగ్‌ ఇన్సిడెంట్‌, ‘చీజ్‌’ అంటూ కామెంట్‌.. ‘రౌడీ’ రియాక్షన్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్‌ అన్న చీజ్‌ కావాలంట? అంటూ కామెంట్స్‌, ‘రౌడీ’ రియాక్షన్‌ చూశారా?

Published Wed, Aug 10 2022 4:45 PM

Media Asks Vijay Devarakonda That He Is Also Want Cheese At Airport - Sakshi

ప్రస్తుతం నార్త్‌లో లైగర్‌ హవా మామూలుగా లేదు. లైగర్‌ ఎక్కడికి వెళ్లిన ఆ ప్రాంతం జనసంద్రంలా మారిపోతుంది. దీంతో విజయ్‌ క్రేజ్‌ చూస్తుంటే సౌత్‌ ఆడియన్స్‌కి మతిపోతోంది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. బాక్సింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్‌ జోరు పెంచేసింది. ఈ క్రమంలో లైగర్‌ టీం ఇటీవల ముంబై, పుణే, పాట్నాలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ ప్రముఖ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ షోతో లైగర్‌ ప్రమోషన్‌ షూరు చేశారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండేలు ఈ షోలో పాల్గొని పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ నీకు చీజ్‌ ఇష్టమా? అని విజయ్‌ని ఆటపట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై విజయ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సంఘటన ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ ‘లైగర్‌’ మీడియా పర్సన్‌ విజయ్‌ అన్న విజయ్‌ అన్న పిలుస్తూ ‘ఇతనికి కూడా చీజ్‌ కావాలంటా?’ అంటూ కామెంట్‌ చేశాడు. అది విన్న విజయ్‌ అతని వంక కాస్తా అసహనంగా చూశాడు. ఇక మనసులోనే ఏదో అనుకుంటూ ముందుకు కదిలాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌ రియాక్షన్‌ చూసిన నెటిజన్లు ‘ఇకపై చీజ్‌ పేరు వింటే విజయ్‌ కోపంతో రగిలిపోతాడేమో’, ‘కాఫీ విత్‌ కరణ్‌ షో ఎంతపని చేసింది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌లో పాల్గొన్న సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌లను డేటింగ్‌ చేయాలంటే ఏ హీరోను ఎంచుకుంటారని అడగ్గా ఇద్దరు విజయ్‌ దేవరకొండ అని సమాధానం చెప్పారు. ఈ ఆన్సర్‌పై జాన్వీని అంటే నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని సారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి సమాధానం విన్న కరణ్‌ జోహార్‌ ఇద్దరు ఒక వ్యక్తితోనే డేటింగ్‌ చేస్తారా! అంటూ విజయ్‌ని చిజ్‌తో పోల్చాడు.  

Advertisement
 
Advertisement
 
Advertisement