కామెడీ పేటిక | Maya Petika first glimpse is out | Sakshi
Sakshi News home page

కామెడీ పేటిక

Nov 12 2022 3:44 AM | Updated on Nov 12 2022 10:15 AM

Maya Petika first glimpse is out - Sakshi

శరత్, అనసూయ, రమేష్, పాయల్, విరాజ్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సునీల్, విరాజ్‌ అశ్విన్, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్, శ్రీనివాస రెడ్డి, హిమజ, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రమేష్‌ రాపార్తి దర్శకుడు. శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసిన నటి అనసూయ మాట్లాడుతూ–  ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూశాను.. చాలా బాగుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

‘‘ఈ తరహా సినిమాలు చేయాలంటే చాలా పరిశోధన చేయాలి’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ‘‘సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ రాశాను. మంచి కామెడీతో ఫుల్‌ఫ్యాక్డ్‌గా ఉన్న సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు రమేష్‌. ‘‘ఈ చిత్రంలో నక్కిలిసు గొలుసు నారాయణ అనే వాచ్‌మెన్‌ పాత్ర చేశాను. కొత్తదనానికే కొత్తగా ఉంటుందీ చిత్రం’’ అన్నారు సునీల్‌. ‘‘మా బ్యానర్‌ నుంచి కరోనా సమయంలో వచ్చిన ‘థ్యాంక్యూ.. బ్రదర్‌’ సినిమాను వీక్షకులు ఆదరించారు. ఆ ధైర్యం, నమ్మకంతోనే ఇప్పుడు ‘మాయా పేటిక’ చిత్రంతో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత శరత్‌. శ్రీనివాస్‌రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement