పుష్ప 2లో నేనా? ఎవరు చెప్పార్రా నాయనా?: నటుడు | Manoj Bajpayee Gives Clarity On Being Part of Pushpa 2 | Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: పుష్ప 2లో నేనా? ఎవర్రా చెప్పింది: నటుడు

Jul 21 2022 9:22 PM | Updated on Jul 21 2022 9:31 PM

Manoj Bajpayee Gives Clarity On Being Part of Pushpa 2 - Sakshi

ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కూడా పుష్ప: ది రూల్‌లో భాగం కానున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ రూమర్స్‌పై మనోజ్‌ స్పందించాడు. మీకిలాంటి

పుష్ప స్వాగ్‌ ఇంకా తగ్గలేదు. పుష్ప డైలాగ్స్‌, సాంగ్స్‌, మేనరిజమ్‌ తరచూ వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో పుష్ప 2లో ఇతర స్టార్స్‌ నటించబోతున్నారంటూ వార్తలు ఊరిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కూడా పుష్ప: ది రూల్‌లో భాగం కానున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే!

తాజాగా ఈ రూమర్స్‌పై మనోజ్‌ స్పందించాడు. మీకిలాంటి వార్తలు ఎవరు చెప్తార్రా నాయనా? అంటూ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశాడు. దీంతో మనోజ్‌ పుష్ప సీక్వెల్‌లో భాగం కాలేదని స్పష్టమైంది. ఇక మనోజ్‌ భాజ్‌పాయ్‌ విషయానికి వస్తే అతడు చివరగా సైలెన్స్‌.. కెన్‌ యు హియర్‌ ఇట్‌, డయల్‌ 100 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడి చేతిలో గుల్‌మొహర్‌ సినిమా, సూప్‌, ఫ్యామిలీ మ్యాన్‌ 3 వెబ్‌ సిరీస్‌ ఉన్నాయి.

చదవండి: రూ.1000 కోట్లు చాలా మామూలు విషయం అంటున్న హీరో
ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్‌, 2 సార్లు చావు అంచుల వరకు..

Advertisement
 
Advertisement
Advertisement