బాబా వల్ల అవకాశాలు తగ్గాయి: మనీషా కొయిరాల | Manisha Koirala reveals the failure of Rajinikanth Baba | Sakshi
Sakshi News home page

బాబా వల్ల అవకాశాలు తగ్గాయి: మనీషా కొయిరాల

Apr 1 2023 1:17 AM | Updated on Apr 1 2023 8:39 AM

Manisha Koirala reveals the failure of Rajinikanth Baba - Sakshi

‘‘బాబా’ సినిమా పరాజయంతో సౌత్‌లో నాకు అవకాశాలు తగ్గాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మనీషా కొయిరాల. రజనీకాంత్, మనీషా జంటగా సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘బాబా’ (2002). ఈ చిత్రం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ – ‘‘తమిళంలో నేను చేసిన చివరి పెద్ద సినిమా ‘బాబా’నే.  ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఘోర పరాజయాన్ని చవి చూసింది.

ఈ సినిమా ఫ్లాప్‌తో సౌత్‌లో నా కెరీర్‌ అయిపోతుందనుకున్నాను. అదే జరిగింది. ‘బాబా’కన్నా ముందు సౌత్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా పరాజయం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే ‘బాబా’ని మళ్లీ విడుదల (రజనీ పుట్టినరోజు డిసెంబర్‌ 12 సందర్భంగా గత ఏడాది డిసెంబర్‌ 10న రీ రిలీజ్‌) చేస్తే, హిట్‌ కావడం ఆశ్చర్యం అనిపించింది. ఏది ఏమైనా రజనీ సార్‌తో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement