అగ్రదర్శకులు... ఒక నిర్మాణ సంస్థ!

Mani Ratnam And Shankar And Others Launches Production House - Sakshi

బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఎన్నో సినిమాలను అందించిన దర్శకులు మణిరత్నం, శంకర్‌ ఇప్పుడు సినిమా వర్షం కురిపించడానికి రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ కొందరు అగ్రదర్శకులతో కలిసి ‘రెయిన్‌ ఆన్‌ ఫిల్మ్స్‌’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆరంభించారు. థియేటర్, ఓటీటీ.. ఇలా పలు ప్లాట్‌ఫామ్‌లకు సినిమాలు, వెబ్‌  సిరీస్‌లు నిర్మించాలన్నదీ, కొత్త మేకర్స్‌కి అవకాశం ఇవ్వాలన్నదే ఈ నిర్మాణ సంస్థ సంకల్పం.
(చదవండి: డ్రగ్స్‌ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్‌ సంజన)

ఈ బేనర్‌లో మణిరత్నం, శంకర్‌తో పాటు భాగస్వాములైనవారిలో ఏఆర్‌ మురుగదాస్, గౌతమ్‌ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంతబాలన్, లోకేశ్‌ కనగరాజ్, బాలాజీ శక్తివేల్‌ ఉన్నారు. తొలి ప్రాజెక్ట్‌కి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ హీరోగా ‘విక్రమ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్‌. ఇది పూర్తయ్యాక ‘రెయిన్‌ ఆన్‌ ఫిల్మ్స్‌’ బేనర్‌లో చేసే సినిమాని ఆరంభిస్తారు. ఇంకా నటీనటులను ఖరారు చేయలేదు. ఇలా అగ్రదర్శకులు కలిసి ఓ నిర్మాణ సంస్థను ఆరంభించడం మంచి విషయమని కోలీవుడ్‌ అంటోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top