Manchu Lakshmi To Host Chef Mantra Season 2 On Aha - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: మంచు లక్ష్మీ హోస్ట్‌గా ‘చెఫ్ మంత్రా ’సీజన్‌ 2

Sep 23 2022 3:38 PM | Updated on Sep 23 2022 7:05 PM

Manchu Lakshmi To Host Chef Mantra Season 2 On Aha - Sakshi

సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది? వారు ఖాలీ టైమ్‌లో ఏం చేస్తారు? ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. వారు అభిమానించే స్టార్సే గరిట పట్టి వంట చేస్తే..చూడ ముచ్చటగా ఉంటుంది కదా? అందుకే అలాంటి కాన్సెప్ట్‌తోనే ‘చెఫ్ మంత్రా’ షోని తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ. మంచు లక్ష్మీ హోస్ట్‌ ‘చెఫ్ మంత్రా’సీజన్‌ 2 ప్రారంభం కాబోతుంది.

సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రానుంది.8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో ను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మి రానుంది.ఈ షో ద్వారా సెలబ్రిటీస్ వంట చేయడమే కాదు, వారు ఎలాంటి ఆహరం ఇష్టపడతారు? ఎలాంటి ఆహారం తీసుకుంటారు? వీటితో పాటు ఎంతో ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ అందిచబోతున్నారు.

 ఈ షో లాంచ్ గురించి లక్ష్మి మంచు మాట్లాడుతూ, "మంచు ఫ్యామిలీలో  అందరం కూడా భోజనప్రియులమే. ఎన్నో విషయాలు లంచ్ లేదా డిన్నర్ టేబుల్ మీద అందరు కలిసి ఉన్నపుడు మాట్లాడుతారు. మంచి ఫుడ్ ఉంటే ఆరోజు చాల బాగా గడిచిపోతుంది. అలాంటి ఒక ఫుడ్ షో ని నేను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ షోను ఇష్టపడతారని ఆశిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement