Man of Masses Jr NTR Opens About His Next Movie - Sakshi
Sakshi News home page

Jr NTR: నెక్స్ట్‌ సినిమా చేయట్లేదు, ఎన్నిసార్లు అడుగుతారు?.. తారక్‌ ఫైర్‌

Mar 18 2023 9:13 AM | Updated on Mar 18 2023 9:58 AM

Man Of Masses Jr NTR Talks About His Next Movie - Sakshi

నెక్స్ట్‌ సినిమా ఎప్పుడు? అంటూ అరవడంతో తారక్‌ కొంచెం ఫైర్‌ అయ్యాడు. 'నెక్స్ట్‌ సినిమా చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి, మొన్నే

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం దాస్‌ కా ధమ్కీ. నివేదా పేతురాజ్‌ కథానాయికగా నటించింది. విశ్వక్‌ సేన్‌ తండ్రి కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పెషల్‌ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'నేనే వాగుతాను అనుకుంటే విశ్వక్‌ నాకన్నా ఎక్కువగా వాగుతాడు. ఒక నగరానికి ఏమైంది సినిమాలో విశ్వక్‌.. లోపల బాధను దిగమింగుకుని కామెడీ పండించాడు. అది గొప్ప విషయం. నటుడిగా, దర్శకుడిగా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. అశోక వనం అర్జున కళ్యాణం, హిట్‌ సినిమాలు చూసి షాకయ్యాను. నటుడిగా ఇంత బ్యాలెన్స్‌గా యాక్ట్‌ చేయడం చాలా కష్టం. ఈ విషయం చెప్పాలో, లేదో నాకు తెలియదు. మంచి సినిమా చేయాలన్న పిచ్చితో విశ్వక్‌ ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశాడు. అతడీ మాట చెప్పినప్పుడు బాధేసింది. ఉగాది రోజు రిలీజవుతున్న ఈ సినిమా విశ్వక్‌కు పండగను తెచ్చిపెట్టాలి' అని చెప్పాడు.

ఇంతలో అభిమానులు నెక్స్ట్‌ సినిమా ఎప్పుడు? అంటూ అరవడంతో తారక్‌ కొంచెం ఫైర్‌ అయ్యాడు. 'నెక్స్ట్‌ సినిమా చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి, మొన్నే కదా చెప్పాను' అనడంతో అందరూ షాకయ్యారు. వెంటనే హీరో.. 'త్వరలోనే మొదలవుతుంది, కొంచెం ఆగండి. మీరపమన్నా నేను ఆపలేను. అయినా నేను ఆపినా మీరు ఊరుకోరు' అని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత తారక్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే! త్వరలోనే ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్‌ చేయనున్నారట.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement