ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య! | Sakshi
Sakshi News home page

Renjusha Menon: బుల్లితెర నటి సూసైడ్.. కానీ కొన్ని గంటల ముందే!

Published Mon, Oct 30 2023 3:08 PM

Malayalam industry TV actress Renjusha Menon has passed away - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్  ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ'తో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇదిలా ఉండగా.. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

రెంజూషా టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'స్త్రీ' సీరియల్‌తో బుల్లితెరపై మెరిసింది. 'నిజలాట్టం,' 'మగలుడే అమ్మ,'  బాలామణి' లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా 'సిటీ ఆఫ్ గాడ్' మరియు 'మెరిక్కుండోరు కుంజడు' అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా 'ఆనందరాగం' అనే టీవీ షోలో లీడ్‌ రోల్ పాత్ర పోషించింది.

Advertisement
 
Advertisement