మలయాళ నటి భామ ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నించిందంటూ కథనాలు వెలువడ్డాయి.
Malayalam Actress Bhama Denies: మలయాళ నటి భామ ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నించిందంటూ కథనాలు వెలువడ్డాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదనేది సదరు కథనాల సమాచారం. తాజాగా దీనిపై స్పందించిన నటి ఈ వార్తలను కొట్టిపారేసింది.
'నాపై వస్తున్న ఆరోపణల్లో, కథనాల్లో ఎలాంటి నిజం లేదు. నా గురించి ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా లోహితదాస్ దర్శకత్వం వహిస్తున్న నైవేద్యం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది భామ. తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2020 జనవరిలో వ్యాపారవేత్త అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పింది. ఆ మరుసటి ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మధ్యే కూతురి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది భామ.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
