‘పుష్ప’ షూటింగ్‌ జరిగిన లొకేషన్‌ ఎంత బావుందో చూశారా? | Makers shares shooting location pic from Pushpa movie | Sakshi
Sakshi News home page

Pushpa: ‘పుష్ప’ షూటింగ్‌ జరిగిన లొకేషన్‌ని షేర్‌ చేసిన మేకర్స్‌

Sep 27 2021 2:23 PM | Updated on Sep 27 2021 3:48 PM

Makers shares shooting location pic from Pushpa movie - Sakshi

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప‌: ది రైజ్‌’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత వీరిద్దరూ ముచ్చటగా..

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప‌: ది రైజ్‌’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి ఈ మూవీకి కలిసి పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌గా ‘దాక్కో దాక్కో మేక’ లిరికల్‌ సాంగ్‌ విడుదలై కొన్ని గంటల్లోనే వైరల్‌ అయ్యింది. దీంతో మరో సాంగ్‌ ఎప్పుడూ రిలీజ్‌ అవుతుందంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నా తరుణంలో మరో పాట గురించి అప్‌డేట్‌ వచ్చింది. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదల చేయనున్నామని చెప్పిన మేకర్స్‌, షూటింగ్‌ లొకేషన్‌ పిక్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఆ పిక్‌ వైరల్‌గా మారింది. అయితే మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్‌కి ప్రేక్షకుల ముందుకు రానున్నా విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు మేకర్స్‌.

చదవండి: 'ఫోటోలు,వీడియోలు తీసినచో సెల్‌ఫోన్‌ పగలగొట్టబడును'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement