కానిస్టేబుల్‌గా విశాల్‌.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్‌ | Sakshi
Sakshi News home page

Hero Vishal: కానిస్టేబుల్‌గా విశాల్‌.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్‌

Published Sat, Jul 9 2022 11:02 AM

Makers Announced Vishal Laththi Movie Shooting Final Schedule at Chennai - Sakshi

హీరో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఆయన స్నేహితులు, నటులు రమణ, నందా కలిసి రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వినోద్‌కుమార్‌ దర్శకుడిగా  పరిచయం అవుతున్నారు. నటి సునైన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ చెన్నైలో చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటుందని తాజాగా మేకర్స్‌ తెలిపారు. ఇందులో విశాల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారని, రియాలిటీ, సర్‌ప్రైజ్‌లతో నిండిన కానిస్టేబుల్‌ జీవితమే ఈ చిత్ర కథ అని తెలిపారు.

చదవండి: ‘ధాకడ్‌’ మూవీ ఫ్లాప్‌.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కంగనా

రాష్ట్రంలో 1.20 లక్షల మంది కానిస్టేబుళ్లు ఉన్నారని, వారికి విధులు పురమాయించే పై అధికారులు మాత్రం చాలా తక్కువ అన్నారు. కానిస్టేబుళ్లకు సాధారణ ఆయుధం లాఠీనే అని పేర్కొన్నారు. దాని విలువ గురించి చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఇందులో విశాల్‌ పెళ్లయ్యి ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా నటిస్తున్నారని, ఆయనకు భార్యగా సునైనా నటిస్తున్నారని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో షూటింగ్‌ పూర్తి అవుతుందని చెప్పారు. కాగా ఇటీవల ఇదే మూవీ షూటింగ్‌ సెట్‌లో విశాల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కుస్తుండంగా విశాల్‌ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో విశాల్‌ కాలికి గాయామైనట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement