Kangana Ranaut Reaction To Rumours On Her Dhaakad Movie Flop, Deets Inside - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ‘ధాకడ్‌’ మూవీ ఫ్లాప్‌.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కంగనా

Jul 9 2022 8:46 AM | Updated on Jul 9 2022 1:09 PM

Kangana Ranaut Respond On Her Dhaakad Movie Flop - Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన యాక్షన్‌ మూవీ ధాకడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడ్డ విషయం తెలిసిందే. రూ.85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.3.77 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక కంగనా కెరీర్‌లోనే థాకడ్‌ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే కంగనా సినిమా ఫ్లాప్‌తో నిర్మాతలు ఆస్తులు అమ్ముకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కంగనా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తన సినిమాపై ఇంటర్నెట్‌లో వ్యతిరేక ప్రచారం జరిగిందని, అందుకే ధాకడ్‌ పరాజయం పొందిందని పేర్కొంది.

చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' 

‘కొందరు చిల్లర వ్యక్తులు కావాలనే ధాకడ్‌ సినిమాపై ఇంటర్నేట్‌లో నెగిటివ్‌ ప్రచారం చేశారు. ఈ మూవీ పరాజయంతో నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం లేదు. ధాకడ్‌ ఫలితంపై నిర్మాత దీపక్‌ ముకుత్‌ పాజిటివ్‌గానే ఉన్నారు. ఇప్పటికి మూవీపై వందలాది వార్తలు వస్తున్నాయి. వాటిని నేను చదువుతున్నా కూడా.  వీటివల్లే నా సినిమా ప్లాప్ అయింది. అలా అయితే గంగూబాయి కథియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 సినిమాల పరాజయాల గురించి వారు ఎందుకు రాయడం లేదు’ అని కంగనా వ్యాఖ్యానించింది. కాగా, అర్జున్ రాంపాల్, దివ్యదత్తా, కంగన తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement