'జిగ్రా' కోసం ఆలియాకి మహేశ్ బాబు విషెస్ | Mahesh Babu Wishes Alia Bhatt's Jigra Movie Team | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఆలియా కొత్త సినిమా.. మహేశ్ శుభాకాంక్షలు

Oct 11 2024 10:32 AM | Updated on Oct 11 2024 10:42 AM

Mahesh Babu Wishes Alia Bhatt's Jigra Movie Team

పేరుకే స్టార్ హీరో కానీ కొత్త సినిమా రిలీజైతే చాలు హీరో మహేశ్ బాబు చూస్తుంటాడు. కచ్చితంగా ట్వీట్ పెట్టి మూవీ ఎలా ఉందో చెప్పేస్తుంటాడు. ఈసారి అలానే రిలీజ్‌కి ముందే ఆలియా భట్‌ 'జిగ్రా' మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)

బాలీవుడ్ బ్యూటీ ఆలియా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జిగ్రా'. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11నే థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఇదే కాదు తెలుగులో ఈసారి దసరాకు 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' చిత్రాలు ప్రేక్షకుల పలకరించాయి. 'వేట్టయన్', 'మార్టిన్', 'జిగ్రా' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా ఇదే పండక్కి థియేటర్లలోకి వచ్చాయి. మరి వీటిలో ఏది హిట్ అయిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తవ్వాల్సిందే.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement