'గుంటూరు కారం' సినిమాలో ఆ మేజిక్ జరిగింది: హీరో మహేశ్‌ బాబు | Mahesh Babu Emotional Speech At Guntur Kaaram Pre-Release Event- Sakshi
Sakshi News home page

Mahesh Babu Emotional Speech: ఇక నుంచి మీరే నాకు అమ్మ నాన్న: సూపర్‌స్టార్ మహేశ్ బాబు

Published Tue, Jan 9 2024 9:37 PM

Mahesh Babu Speech In Guntur Kaaram Pre Release Event - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. అయితే అందరూ ఎదురుచూసే డైరెక్టర్ త్రివిక్రమ్ సింపుల్ స్పీచుతో ముగించేశాడు. హీరో మహేశ్ మాత్రం ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యాడు. అభిమానులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయగా ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

'త్రివికమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటోళ్లు. నేను ఆయన గురించి బయట ఎ‍ప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడుతాం. గత రెండేళ్ల నుంచి ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు మర్చిపోలేను. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా నాకు వింతగానే ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోం.

ఆయన (త్రివిక్రమ్) సినిమాల్లో నేను ఎప్పుడు చేసినా సరే ఓ మేజిక్ జరుగుతుంది. అది నాకు తెలీదు. 'అతడు' నుంచి మా జర్నీ మొదలైంది. 'ఖలేజా'లో ఒక మేజిక్ జరిగింది. అదే మేజిక్ ఇప్పుడు 'గుంటూరు కారం'లోనూ జరిగింది. మీరు ఓ కొత్త మహేశ్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే(త్రివిక్రమ్) కారణం.

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)

'తెలుగమ్మాయి చాలారోజుల తర్వాత స్టార్ హీరోయిన్ కావడం చాలా బాగుంది. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం వామ్మో! ఇదేం డ్యాన్స్!' అని శ్రీలీలని ఉద్దేశించి మహేశ్ మాట్లాడాడు. అలానే తమన్ గురించి చెబుతూ.. ''కుర్చీ మడతపెట్టి' పాట చేస్తావా? అని తమన్‌ని అడిగితే వెంటనే ఒప్పుకొన్నాడు. రేపు మీరు ఆ పాట చూడండి థియేటర్లు బద్దలైపోతాయి' అని మహేశ్ చెప్పాడు.

ఇక చివర్లో కాస్త భావోద్వేగానికి గురైన మహేశ్ అభిమానులని ఉద్దేశిస్తూ.. 'మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలీదు. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. బాగా గట్టిగా. ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ మీ ఆశీస్సులు అభిమానం నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పి స్పీచ్ ముగించేశాడు.

(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!)

Advertisement
 
Advertisement
 
Advertisement