భైరవకి మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌? | Mahesh Babu To Lend His Voice To Prabhas Vishnu Avatar Character In Kalki 2898 AD, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu Voice To Prabhas: భైరవకి వాయిస్‌ ఓవర్‌?

Published Thu, May 9 2024 6:00 AM

Mahesh Babu Special In Prabhas Kalki 2898 AD

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మహేశ్‌బాబు భాగం కానున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌ నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఈ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌లో మహేశ్‌బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్‌కి మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

గతంలో ‘జల్సా’, ‘బాద్‌ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు మహేశ్‌బాబు  వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహేశ్‌ వాయిస్‌ వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపిస్తారు. కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌. 

Advertisement
 
Advertisement
 
Advertisement