మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్!‌

Mahesh Babu To Romance With Bollywood Beauty Janhvi Kapoor - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్లుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నటించే వీరి సినిమాలను అభిమానులు పోటీపడి మరీ చూసేవారు. అప్పట్లో వీరి జోడీకి అంత క్రేజ్‌ ఉండేది. ఇదిలా వుంటే కృష్ణ కుమారుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ జోడీగా నటించనున్నట్లు ఫిల్మీ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించనన్నట్లు టాక్‌. పైగా ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారట. షూటింగ్‌ను కూడా సాగదీయకుండా కేవలం రెండు నెలల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ముందుకెళ్తుంది? అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!

కాగా మహేశ్‌ ప్రస్తుతం 'గీతా గోవిందం' ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా పూర్తవగానే మహేశ్‌ జాన్వీతో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్‌ నటించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే జాన్వీ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన హారర్‌ సినిమా 'రూహీ'కి మిశ్రమ స్పందన లభిస్తోంది.

చదవండి: సుకుమార్‌ కుమార్తె ఫంక్షన్‌ : టాలీవుడ్‌ స్టార్స్‌ తళుక్కు

అభిమాని కోసం హీరోయిన్‌ ఆవేదన!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top