షాకింగ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన వివాదాస్పద కమెడియన్‌ | Sakshi
Sakshi News home page

Munawar Faruqui: ఆమెతో కమెడియన్‌ లవ్‌ ట్రాక్‌.. ఒక్క ఫొటోతో బండారం బయటపెట్టిన కంగనా

Published Sun, Apr 10 2022 4:46 PM

Lock Upp: Comedian Munawar Faruqui Reveals Shocking Secret:, He Is Married And Has a Child - Sakshi

తరచూ వివాదాల్లో నానుతూ ఉండే స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ. ప్రస్తుతం ఇతడు కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాకప్‌ షోలో ఓ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఈ మధ్యే తోటి కంటెస్టెంట్‌ అంజలి అరోరా ఇతడి​కి ఐ లవ్‌యూ చెప్పగా తెగ సిగ్గుపడిపోయాడు మునావర్‌. వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ మొదలైందో లేదో అప్పుడే పెద్ద బాంబు పేల్చాడు కమెడియన్‌. స్క్రీన్‌పై బ్లర్‌ ఫొటో పెట్టి దాని గురించి నిజాలు చెప్పమంటూ కంగనా అడగ్గా తనగురించి ఎవరికీ తెలియని ఓ షాకింగ్‌ సీక్రెట్‌ను బయటపెట్టాడు.

తనకు ఇదివరకే పెళ్లైందన్న విషయాన్ని వెల్లడించాడు. భార్యతో పాటు ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలిపాడు. కాకపోతే తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని తన కొడుకు కోసమే ఈ షోకు వచ్చానన్నాడు. కాగా గుజరాత్‌కు చెందిన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన వివాదాస్పద స్టాండప్‌ ఆర్టిస్ట్‌. హాస్య ప్రదర్శనల్లో మునావర్‌ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్‌ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేశాడితడు. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు.

గతంలో ఎన్‌ఆర్‌సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్‌ కూడా వివాదాస్పదమైంది. హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గతేడాది జనవరి 1న ఇండోర్‌ పోలీసులు మునావర్‌ని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలబ్రిటీ అయ్యాడు.

చదవండి: బ్రహ్మాస్త్ర లవ్‌ పోస్టర్‌.. అలియా-రణ్‌బీర్‌ల పెళ్లికి హింట్‌ !

అదో పెద్ద స్కామ్‌.. హృతిక్‌పై కంగనా సంచలన కామెంట్స్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement