Sunny Leone Says Her PAN Card Used For loan Rs 2000: Loan fraud - Sakshi
Sakshi News home page

Sunny Leone: సన్నీ లియోన్‌ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్‌.. ఆ తర్వాత

Feb 18 2022 4:15 PM | Updated on Feb 18 2022 4:49 PM

Loan fraud: Sunny Leone Says Her PAN Card Used For loan Rs 2000 - Sakshi

Sunny Leone Says PAN Card Used for Loan Fraud: తన పాన్‌ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ఆరోపించింది. తన పాన్‌ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారంటూ ఆమె సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు సన్నీ లియోన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. 

చదవండి: నష్టా‍ల్లో రామ్‌ చరణ్‌ బిజినెస్‌, నిలిచిపోయిన సేవలు 

అనంతరం కొద్ది సేపటి తర్వాత సన్నీ లియోన్‌ ఈ ట్వీట్‌ను డిలిట్‌ చేసి మరో ట్వీట్‌ ఐవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇలాంటి మోసాలకు నిత్యం వందల మంది బాధ్యులు అవుతుంటారు. ఆ తర్వాత అవి పరిష్కారమవుతుంటాయి. కానీ సన్నీ లియోన్‌ తొందరపడి ఐవీఎల్‌ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్‌ డిలిట్‌ చేయడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement