కిరణ్‌ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ | Lion Kiron K Party In Cowboy Style and Fashion Show | Sakshi
Sakshi News home page

Lion Kiron: కౌ బాయ్‌ థీమ్‌తో బర్త్‌డే పార్టీ

Dec 20 2021 3:53 PM | Updated on Dec 20 2021 4:37 PM

Lion Kiron K Party In Cowboy Style and Fashion Show - Sakshi

కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్‌లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్..

వినూత్న శైలి 'కె పార్టీ'కి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి అదుర్స్‌ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఒక థీమ్‌తో సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్‌లో  కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్, బాలీవుడ్ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్‌లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధులకు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement