Netizens Searching For Lavanya Tripathi Caste On Google After Engagement With Varun Tej - Sakshi
Sakshi News home page

కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!

Jun 12 2023 1:18 PM | Updated on Jun 12 2023 5:41 PM

lavanya Tripathi Caste Searching Netizens Google - Sakshi

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఓ వైపు సినిమాల్లో మరోవైపు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ ఏడాదిలో తను ప్రేమించిన మెగాహీరో వరుణ్​ తేజ్‌ను పెళ్లాడనుంది. ఈ నేపథ్యంలోనే జూన్‌ 9న  నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అందువల్ల ఆమె పేరు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియా ద్వారా మెగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే  సందర్భంలో కొందరు నెటిజన్లు మాత్రం లావణ్య క్యాస్ట్‌ కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. సెలబ్రిటీల బయోడేటాను తెలుసుకునేందేకు చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఈ బ్యూటీ వచ్చి చేరింది. లావణ్య క్యాస్ట్‌ ఏంటి? అని నెటిజన్లు వెతకడంతో ఆమె పేరు గూగుల్‌లో టాప్‌ ట్రెండింగ్‌ అయిపోయింది.

(ఇదీ చదవండి: అతనొక స్టార్ కమెడియన్.. అలా చేస్తారనుకోలేదు: ప్రగతి)


ఉత్తర ప్రదేశ్‌, ఫైజాబాద్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించిన ఈ అమ్మడు.. డెహ్రడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది కాగా, తల్లి రిటైర్డ్​ టీచర్​. తనకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. తమ కుటుంబంలో క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యత ఉండదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది లావణ్య. 'మనం చేసే పనుల వల్ల మాత్రమే గొప్ప వాళ్లం అవుతాం. అంతేకాని కులం వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు' అని గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇవే మాటలను మెగా ఫ్యాన్స్‌ నెటిజన్లకు గుర్తు చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెబుతూ..  మెగా కుటుంబంలో కూడా క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వరు అని వారు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ క్యాస్ట్‌ గోల ఏంటి? అని తప్పుబడుతున్నారు.

(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement