'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్ | Laggam Movie Shooting Complete, Interesting Deets About Release Date | Sakshi
Sakshi News home page

'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్

Published Sat, May 4 2024 6:41 PM | Last Updated on Sat, May 4 2024 7:00 PM

Laggam Movie Shooting Complete And Release Details

'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.

(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)

రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement