ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | 8 AM Metro Movie Ott Release Details Out | Sakshi
Sakshi News home page

8 AM Metro: ఇన్నాళ్లకు ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ మూవీ

Published Sat, May 4 2024 3:45 PM | Last Updated on Sat, May 4 2024 4:34 PM

8 AM Metro Movie Ott Release Details Out

ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన నెల నెలన్నర గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్నిసార్లయితే నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతుంది. అలాంటిది ఓ మూవీ దాదాపు ఏడాది తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ దీన్ని తీసింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.

(ఇదీ చదవండి: సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్‌ సిరీస్ రివ్యూ)

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమాతో రాజ్ రాచకొండ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ మలయాళ మూవీ నిర్మించాడు. కానీ '8 ఏఎమ్ మెట్రో' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది మే 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ ఊసే లేదు. ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది.

దాదాపు ఏడాది తర్వాత అంటే మే 10 నుంచి '8 ఏఎమ్ మెట్రో' మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. మహారాష్ట్ర చెందిన ఐరావతి (సయామీ ఖేర్).. సోదరి ప్రసవం కోసం హైదరాబాద్ వస్తుంది. చిన్నప్పడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అప్పుడప‍్పుడు పానిక్ ఎటాక్‌కి గురవుతూ ఉంటుంది. అలాంటి ఈమెకు మెట్రోలో ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మెయిన్ పాయింట్.

(ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఈనెలలో ఓటీటీలోకి 100 సినిమాలు/ సిరీస్‌లు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement