NBK107: Is Krithi Shetty Rejected Balakrishna Movie Offer, Deets Inside - Sakshi
Sakshi News home page

#NBK107-Balakrishna: బాలయ్య సినిమాకు నో చెప్పిన యంగ్‌ స్టార్‌ హీరోయిన్‌

Mar 1 2022 12:52 PM | Updated on Mar 1 2022 2:24 PM

Is Krithi Shetty Rejects Nandamuri Balakrishna NBK 107 Movie Offer - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. అఖండ తర్వాత వెంటనే గోపించంద్‌ మలినేని మూవీని స్టార్ట్‌ చేశాడు. దీని తర్వాత అనిల్‌ రావిపూడితో ఓ సినిమాతో మరిన్ని ప్రాజెక్టస్‌ చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే107(#NBK107) మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌ పోష్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులుగా బాలయ్య రెండు పాత్రలు చేయనున్నాడట. ఇందులో ఒక హీరోయిన్‌ శ్రుతి హాసన్‌గా సెకండ్‌ హీరోయిన్‌ వేటలో ఉన్నాడట గోపించంద్‌ మిలినేని. దీంతో ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించగా.. దానికి ఆమె నో చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కృతి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మరో భారీ విజయాలను ఆమె ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తుండటంతో డేట్స్‌ సర్ధుపాటు కాక బాలయ్య సినిమాకు ఆమె నో చెప్పినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అలాగే ప్రస్తుతం లీడ్‌ హీరోయిన్‌ ఆఫర్స్‌ వస్తున్న క్రమంలో సెకండ్‌ హీరోయిన్‌ నటించడం వల్లే కెరీర్‌పై దెబ్బ పుడుతుందనే భయంతో కూడా ఈ మూవీ ఆఫర్‌ను తిరస్కరించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బేబమ్మ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement