Krishnam Raju: ఆ సమయంలో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు.. కానీ!

Krishnam Raju Wanted To Leave The Film Industry But LV Prasad Stopped It - Sakshi

కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం  ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్‌ ఎల్వీ ప్రసాద్‌. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు.

ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్‌లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట.

కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్‌ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్‌ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్‌ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్‌ఫుల్‌ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top