
అమెరికాలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. యూఎస్‌లో జరుగుతున్న నాట్స్ 2025 కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ డైరెక్టర్స్ సుకుమార్, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్‌కు నాకు కామన్‌గా ఒక పోలిక ఉంది. అదేంటంటే గడ్డం. అడవిరాముడు, అన్నమయ్య. నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్నా. నువ్వు పుష్ప సినిమాలో అడవిని నమ్ముకున్నావ్. స్టార్ డైరెక్టర్ అయ్యావ్. బన్నీని స్టార్‌హీరోను చేశావ్. శ్రీలీల సైతం దెబ్బలు పడతాయి అంటూ అందరిని అలరిస్తోందని' ఆయన అన్నారు.