
రానా దగ్గుబాటి నిర్మిస్తున్న 'కొత్తపల్లిలో ఒకప్పుడు'(KOTHAPALLILO OKAPPUDU) చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల భారీ విజయాన్ని అందుకున్న కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. అయితే, గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మరోసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ మూవీని నిర్మించారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. జులై 18న ఈ మూవీ విడుదల కానుంది.