breaking news
Praveena Paruchuri
-
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
ఈ సినిమాకి ఆదరణ లభించడం ఆనందం: దర్శకురాలు ప్రవీణ
‘‘ఓ సినిమా తీసి, దాన్ని రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లడం పెద్ద టాస్క్. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నమ్మకం గురించిన కథ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా. లైట్ హార్టెడ్ కామెడీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి... మంచి అనుభూతినిస్తుంది’’ అని అన్నారు ప్రవీణ పరుచూరి. మనోజ్ చంద్ర, మోనికా .టి, ఉషా బోనేలా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా సమర్పణలో ప్రవీణ పరుచూరి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో మనోజ్ చంద్ర మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను పోషించిన రామకృష్ణ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి మరిన్ని సినిమాలకు రానాగారు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చాలా మంచి సినిమా ఇది. థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు టి. మోనిక, ఉషా బోనేలా. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ మెహరా బాబా మాట్లాడారు. -
'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య తదితర సినిమాలని నిర్మించిన ప్రవీణ పరుచూరి.. దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. దాదాపు కొత్త నటీనటులతో తీసిన ఈ మూవీకి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ రూరల్ డ్రామా సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ)కథేంటి?కొత్తపల్లి అనే ఊరు. అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడిగా పనిచేస్తుంటాడు. అదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో.. పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు. అయితే నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసే మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య చిత్రాల్ని నిర్మించిన ప్రవీణ.. ఆ అనుభవంతో తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాని కూడా అదే జానర్లో తీశారు. బిగినర్స్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కథని డిఫరెంట్‌గానే ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.కొత్తపల్లిలో అనే ఊరిలో అప్పులిచ్చి వడ్డీలు కట్టించుకునే అప్పన్న, రికార్డింగ్ డ్యాన్సులు కడుతూ అప్పన్న దగ్గర పనిచేసే హీరో రామకృష్ణ.. అతడి ప్రేమించి సావిత్రి, సావిత్రి వాళ్ల ఇంట్లో పనిచేసే అందం.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లేసరికి ఫస్టాప్ అయిపోతుంది. సరదా సరదాగా సాగిపోతూనే ఇంటర్వెల్‌కి చిన్న ట్విస్ట్ పడుతుంది. అప్పటివరకు సరదాగా సాగిన మూవీ కాస్త.. సెకండాఫ్‌కి వచ్చేసరికి దెయ్యం, దేవుడు అంటూ ఫిలాసఫీ వైపు మళ్లుతుంది.'దేవుడంటే నిజమో అబద్ధమో కాదు ఓ నమ్మకం' అనే పాయింట్‌ని చెప్పిన విధానం బాగుంది. కాకపోతే అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే చాలావరకు నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నంలా అనిపిస్తుంది. మొదట్లో నేచురల్‌గా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత జరిగే సీన్స్ కొన్ని మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే మాత్రం చూస్తున్న రెండు గంటల పాటు ఎంటర్టైన్ అవుతారు.ఎవరెలా చేశారు?మనోజ్ చంద్ర రామకృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. తెరపై అమాయకంగా కనిపిస్తూ అలరించాడు. సావిత్రిగా చేసిన మౌనిక కంటే అందంగా చేసిన ఉషాకు కాస్త ఎక్కువ స్కోప్ దొరికింది. కాకపోతే హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మిగిలిన పాత్రధారులు ఉన్నంతలో బాగానే చేశారు. వంక పెట్టడానికి ఏం లేదు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మరీ గుర్తుంచుకునేలా ఉండవు కానీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఫైనల్‌గా దర్శకురాలు కమ్ నిర్మాత ప్రవీణ గురించి చెప్పుకోవాలి. తను అనుకున్న స్టోరీని నిజాయతీగా చెప్పారు. కాకపోతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి.- చందు డొంకాన(ఇదీ చదవండి: పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?) -
అదే సవాల్‌గా అనిపించింది: ప్రవీణ పరుచూరి
‘‘చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా అంటే చాలామంది యాక్టింగ్ అనుకుంటారు. అలా నేను కూడా అమెరికాలో యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. ఫిల్మ్ మేకింగ్ గురించి షార్ట్ కోర్సు చేశాను. నాట్యం నేర్చుకున్నాను. నటన, సాహిత్యం, సంగీతం వంటి అంశాలపై మరింత అవగాహన పెంచుకున్నాను. డైరెక్షన్ అనేది చాలా కష్టమైన క్రాఫ్ట్. నేను నిర్మించిన గత రెండు సినిమాలు (‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’) నాకు అనుభవాన్ని ఇచ్చాయి. దీంతో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ సినిమాతో దర్శకురాలిగా మారాను’’ అన్నారు నటి–నిర్మాత– దర్శకురాలు ప్రవీణ పరుచూరి.మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో, ప్రవీణ పరుచూరి ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. దగ్గుబాటి రానా సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ–‘‘మన గ్రామ దేవతలపై మనకు నమ్మకం, విశ్వాసం ఉంటుంది. కొందరికి చెట్టుపై కూడా నమ్మకం ఉంటుంది. ఈ సినిమాలో ఓ చెట్టు గురించిన ప్రస్తావన కూడా ఉంది.అలాంటి నమ్మకాలను ఈ సినిమాలో న్యూట్రల్‌గా చూపించే ప్రయత్నం చేశాం. అల్లు అర్జున్ గారితో పోలిక పెట్టడం లేదు కానీ..‘పుష్ప2’ సినిమాలోని జాతర సీన్ తరహా ఎనర్జీ ఉండే ఓ సీన్ ఉంది. రానాగారు మంచిగా సపోర్ట్ చేశారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఈ సినిమా చేయడం సవాల్‌గా అనిపించలేదు. కానీ, ఓ డాక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా టైమ్‌ను కేటాయించుకోవడం నాకు సవాల్‌గా అనిపించింది. నా తొలిమూడు సినిమాలు ఉత్తరాంధ్ర నేపథ్యంతోనే ఉన్నాయి. నా తర్వాతి సినిమాను సిటీ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తాను. ఓ పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు
ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్లో అడుగుపెట్టి కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.డైరెక్షన్ కష్టంతాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్ చాలా కష్టమైనది. డైరెక్షన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఈ పర్ఫామెన్స్ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్ అవుతుందా? ఈ ఎడిట్ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.హీరోను కొట్టా, తిట్టా..హీరో మనోజ్ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది? -
'కొత్తపల్లిలో ఒకప్పుడు'.. ఏం జరిగిందంటే..? (ట్రైలర్)
రానా దగ్గుబాటి నిర్మిస్తున్న 'కొత్తపల్లిలో ఒకప్పుడు'(KOTHAPALLILO OKAPPUDU) చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల భారీ విజయాన్ని అందుకున్న కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. అయితే, గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మరోసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ మూవీని నిర్మించారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. జులై 18న ఈ మూవీ విడుదల కానుంది. -
కొత్తపల్లిలో ఒకప్పుడు!
‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మళ్లీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ చిత్రం నిర్మిస్తున్నారు.‘‘ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామీణ యువకుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక లవ్లెటర్లాంటిది ఈ చిత్రం. నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని యూనిట్ పేర్కొంది. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘కేరాఫ్ కంచెరపాలెం’ఫేం ప్రవీణ కొత్త చిత్రం
కేరాఫ్ కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు తెరకెక్కించి.. నిర్మాతగా మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ పరుచూరి. తాజాగా ఆమె మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. కథే హీరో గా తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి అదే తరహాలో నిర్మాత ప్రవీణ పరుచూరి చిత్రాలను నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి అయిన ప్రవీణ అమెరికాలో స్థిరపడ్డారు, తెలుగు సినిమా, భాషపై అభిమానంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు రూరల్ బ్యాక్ డ్రాప్లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా మూడో సినిమా ఏ జోనర్లో వస్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రవీణ పరుచూరి మూడో చిత్రం ద్వారా మరోసారి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించబోతున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.