
కేరాఫ్ కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు తెరకెక్కించి.. నిర్మాతగా మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ పరుచూరి. తాజాగా ఆమె మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
కథే హీరో గా తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి అదే తరహాలో నిర్మాత ప్రవీణ పరుచూరి చిత్రాలను నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి అయిన ప్రవీణ అమెరికాలో స్థిరపడ్డారు, తెలుగు సినిమా, భాషపై అభిమానంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా మూడో సినిమా ఏ జోనర్‌లో వస్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రవీణ పరుచూరి మూడో చిత్రం ద్వారా మరోసారి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించబోతున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.