
‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మళ్లీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ చిత్రం నిర్మిస్తున్నారు.
‘‘ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామీణ యువకుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక లవ్‌లెటర్‌లాంటిది ఈ చిత్రం. నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని యూనిట్ పేర్కొంది.