Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question - Sakshi
Sakshi News home page

Kareena Kapoor: క్వాలిటీ శృంగారంపై హీరోయిన్‌కు నిర్మాత ప్రశ్న..

Aug 2 2022 7:15 PM | Updated on Aug 2 2022 8:37 PM

Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question - Sakshi

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా సక్సెస్‌ అయిన షో 'కాఫీ విత్‌ కరణ్' టాక్‌ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో పార్టిస్‌పేట్‌ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్‌.

Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా సక్సెస్‌ అయిన షో 'కాఫీ విత్‌ కరణ్' టాక్‌ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో పార్టిస్‌పేట్‌ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్‌. ఇటీవలిటీ ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్‌ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్‌ ప్రొమోను బయటకు వదిలారు. 

ఈ ఎపిసోడ్‌లో 'లాల్‌ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్‌ జోహర్‌ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్‌ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్‌ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. 

చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్‌ నాయకుడి కుమార్తె మృతి..
హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్‌ చేసుకోవాలని ట్వీట్‌

కాగా అమీర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్‌ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ అయిన 'ఫారెస్ట్ గంప్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించారు.

చదవండి: నాగార్జునతో 'విక్రమ్‌' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్‌
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?

 

Advertisement
 
Advertisement
Advertisement