Kiran Abbavaram Interesting Comments On Nenu Meeku Baga Kavalsina Vadini Movie - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది: కిరణ్‌ అబ్బవరం

Published Wed, Sep 14 2022 9:12 PM

Kiran Abbavaram About Nenu Meeku Baga Kavalsina Vadini Movie at Promotions - Sakshi

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం. ఆయన తాజాగా నటిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిద్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, సోను ఠాగూర్, భరత్ రొంగలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

‘యస్‌.ఆర్‌ కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న దేశవ్యాప్తంగా దాదాపు 550 పైచిలుకు థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మూవీ హీరో కిరణ్ అబ్బవరం బుధవారం మీడియాతో ముచ్చటించారు.

⇔ దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌

⇔ మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. 

⇔ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో  రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర  చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్‌కి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది..⇔ దర్శకుడు  శ్రీధర్ నా కాంబినేషన్‌లో సినిమా చేయడానికి  కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్‌ ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్‌ల ట్రాక్ చాలా బాగుంటుంది.

⇔ నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే  ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. అయన ఇచ్చిన పాటలు అద్భుతంగా వచ్చాయి. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

⇔ ఇక తన తదుపరి చిత్రాలతో గురించి ప్రస్తావిస్తూ.. గీతా ఆర్ట్స్‌ ‘వినరో విష్ణు భాగ్యం’, మైత్రి మూవీ మేకర్స్‌లో ‘మీటర్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40 శాతం షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement