హీరోయిన్‌తో రహస్యంగా లవ్‌..? సిగ్గుపడిపోయిన యంగ్‌ హీరో! | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ..

Published Fri, Oct 27 2023 10:32 AM

Kiran Abbavaram About his Relationship with Rahasya Gorak - Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇదే మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్‌. ఈ చిత్రం హీరోహీరోయిన్లుగా వీరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే రాజావారు రాణిగారు షూటింగ్‌ సమయంలో కిరణ్‌, రహస్యల మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారిందని టాక్‌ నడిచింది. సోషల్‌ మీడియాలో వీరిని లవ్‌ బర్డ్స్‌గా పేర్కొంటూ ఎన్ని వార్తలు వచ్చినా వీరిద్దరు మాత్రం పట్టించుకోలేదు.

కలిసి వెకేషన్‌కు?
ఆ మధ్య కిరణ్‌ వెకేషన్‌కు వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలు షేర్‌ చేశాడు. అటు రహస్య కూడా అదే లొకేషన్‌లో దిగిన ఫోటో షేర్‌ చేయడంతో వీరిద్దరూ కలిసే షికారుకు వెళ్లారని తేలిపోయింది. ఆ తర్వాత కిరణ్‌ గృహప్రవేశ వేడుకలోనూ సందడి చేయడంతో వీరిమధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని అభిమానులు ఫిక్సయిపోయారు. తాజాగా మరోసారి దొరికిపోయాడు కిరణ్‌ అబ్బవరం.

తెగ సిగ్గుపడిపోయిన హీరో
పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ దావత్‌ అనే కొత్త షోను మొదలుపెట్టింది. ఈ షోలోకి కిరణ్‌ మొదటి గెస్టుగా విచ్చేశాడు. ఇక వచ్చీరావడంతోనే తన లవ్‌ లైఫ్‌ గురించి అడిగేసింది హోస్ట్‌ అషూ రెడ్డి. రహస్య గోరఖ్‌, మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడగడంతో అలాంటిదేమీ లేదని, అలాంటిదేదైనా ఉంటే చెప్తామని బదులిచ్చాడు. చెప్తాము అంటున్నారంటే ఇద్దరూ కలిసి ఒకేసారి పెళ్లి డేట్‌ ఎప్పుడో చెప్తారా? అని ఆటపట్టించింది అషూ. దీంతో సిగ్గుపడిపోయిన కిరణ్‌.. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడూ ఇంతలా దొరికిపోలేదు అని చెప్పుకొచ్చాడు. దొరికిపోయాను అంటున్నాడంటే నిజంగానే వీరిద్దరూ లవ్‌లో ఉన్నట్లేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: గడగడలాడిస్తోన్న శోభా శెట్టి, గయ్యాలి గంపలా నోరేసుకుని సాధిస్తోంది! ఆఖరికి అర్జున్‌ కూడా..

Advertisement

తప్పక చదవండి

Advertisement