15 ఏళ్ల క్రితం సూపర్‌ హిట్‌ అయిన రవితేజ సినిమా రీరిలీజ్‌ | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల క్రితం సూపర్‌ హిట్‌ అయిన రవితేజ సినిమా రీరిలీజ్‌

Published Mon, Feb 19 2024 7:17 AM

Kick Movie Re Release Date Locked - Sakshi

మాస్‌మహారాజా రవితేజ కెరియర్‌లో కిక్‌ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది.  ర‌వితేజ, బ్ర‌హ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హ‌ల్వారాజ్ పాత్ర‌లో బ్ర‌హ్మానందం పండించిన కామెడీ సూపర్‌ హిట్‌ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్‌ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్‌ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్‌ సినిమా రీరిలీజ్‌ కానుంది.

సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఇందులో  ర‌వితేజ‌కు జోడీగా ఇలియానా న‌టించింది. కోలీవుడ్ న‌టుడు శామ్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్‌ సంగీతం అదిరిపోతుంది. కిక్‌ సినిమాతో థమన్‌, సురేంద‌ర్‌రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.  

ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్‌ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్‌తో థియేటర్‌లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ రీరిలీజ్‌ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్‌ను కూడా ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement