Mahasamudram Villain: భయంకర పాత్రలో ‘కేజీఎఫ్‌’ గరుడ

KGF Garuda Ram As A Dhanunjay In Maha Samudram Movie - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు, రావు రమేశ్‌ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ చిత్రంలో కీలయ పాత్ర చేస్తున్న కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామ్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన ధనుంజయ్‌ అను విలన్‌ పాత్రని చేస్తున్నాడు. ఒక రాక్షస రాజులా కనిపించనునున్నాడు.

ఈ సినిమాలో ఆయన మెయిన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top