గుడ్‌ లక్‌

Keerthy Suresh Good Luck Sakhi teaser on 15th August - Sakshi

కీర్తీ సురేశ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖీ’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నగేశ్‌ కుకునూర్‌ దర్శకుడు. ‘దిల్‌’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. స్పోర్ట్స్‌ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి  గ్రామీణ యువతిగా నటిస్తున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు  ఎక్కువశాతం మంది మహిళలు పని చేయటం విశేషం. ఓ చిన్న షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రావ్యా వర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top