సీనియర్ హీరోతో తొలిసారి కీర్తి సురేష్ | Keerthy Suresh for first time with a senior hero Venkatesh | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోతో తొలిసారి కీర్తి సురేష్

Apr 22 2026 11:58 PM | Updated on Apr 23 2026 12:24 AM

Keerthy Suresh for first time with a senior hero Venkatesh

సంక్రాంతి టార్గెట్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి మరో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా ఫిక్స్ అయ్యారు. ఇక హీరోయిన్‌ల ఎంపిక కూడా వేగంగా పూర్తి చేశారు. కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకున్న మేకర్స్, తాజాగా వెంకటేశ్ సరసన కీర్తి సురేష్‌ను లాక్ చేశారు. కీర్తి సురేష్ ఇప్పటివరకు యువ హీరోలతోనే ఎక్కువగా నటించింది. కానీ వెంకటేశ్ లాంటి సీనియర్‌ హీరో సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.  

అనీల్ రావిపూడి హీరోయిన్లను ఒప్పించడంలో ప్రత్యేకత కలిగిన దర్శకుడు. ఇటీవల వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రం కోసం నయనతారను ప్రచారానికి ఒప్పించారు. ఇప్పుడు కీర్తి సురేష్‌ను వెంకీ సరసన హీరోయిన్‌గా తీసుకోవడం అనీల్‌కు పెద్ద సవాల్ కాదు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్థన సినిమాను పూర్తి చేసి, వెంటనే వెంకీతో కొత్త ప్రాజెక్ట్‌లో చేరనుంది కీర్తి. వచ్చే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలా దూసుకెళ్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement