పాన్‌ ఇండియా సినిమా ట్రైలర్‌ తొలగింపు | KD The Devil Movie Trailer Removed In YouTube | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా సినిమా ట్రైలర్‌ తొలగింపు

Apr 25 2026 8:57 AM | Updated on Apr 25 2026 9:11 AM

KD The Devil Movie Trailer Removed In YouTube

జన నాయగన్‌ మూవీ నిర్మాత వెంకట్‌ కె నారాయణ నిర్మించిన మరో పాన్‌ ఇండియా చిత్రం 'కేడీ ది డెవిల్‌'. . కన్నడలో తెరకెక్కుతున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితం ఒక పాట వివాదాస్పదం కావడంతో టైటిల్‌ బాగా వైరల్‌ అయింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో లేదు. దీంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు పోస్టులు షేర్‌ చేయడంతో నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ క్లారిటీ ఇచ్చింది.

'కేడీ ది డెవిల్‌' మూవీ ట్రైలర్‌  ధ్రువీకరించని కంటెంట్‌తో పొరపాటున విడుదలైందని చిత్ర యూనిట్‌ వివరణ ఇచ్చింది. దీంతో  యూట్యూబ్‌ నుంచి తొలగించామని క్లారిటీ ఇచ్చింది. సెన్సార్‌ మార్గదర్శకాలను అనుసరించి మరోసారి కొత్త‌ వెర్షన్‌ను యూట్యూబ్‌లో ట్రైలర్‌ అప్‌లోడ్‌ చేస్తామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

దర్శకుడు ప్రేమ్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నటుడు ధ్రువ సర్జ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి శిల్పాశెట్టి, వి.రవిచంద్రన్‌, రమేష్‌ అరవింద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ నటి నోరా ఫతేహితో ఒక ప్రత్యేక పాటలు నటించడం విశేషం.  ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement