కథ వెనుక కథ టీజర్‌ చూశారా? | Katha Venuka Katha Teaser out | Sakshi
Sakshi News home page

Katha Venuka Katha: కథ వెనుక కథ టీజర్‌ చూశారా?

Feb 18 2023 2:14 AM | Updated on Feb 18 2023 8:34 AM

Katha Venuka Katha Teaser out - Sakshi

విశ్వంత్‌ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్‌ నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్‌ ఆసక్తిగా ఉంది. సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు.

అవనీంద్ర కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించి, కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలను అందించాలనే ఆలోచనతో దండమూడి బాక్సాఫీస్‌ సంస్థని స్థాపించాను. తొలి చిత్రంగా సస్పెన్స్, థ్రిల్‌ నేపథ్యంలో ‘కథ వెనుక కథ’ తీశాం. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదు, ఓ గ్యాంగ్‌ అని  పోలీసాఫీసర్‌ సత్య ఎలా తెలుసుకుంటాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement