సంజయ్‌ వర్మ.. కథ మొదలైంది | Katha Modalaindi Movie Opening | Sakshi
Sakshi News home page

కథ షురూ

Dec 7 2020 6:14 AM | Updated on Dec 7 2020 7:20 AM

Katha Modalaindi Movie Opening - Sakshi

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథ మొదలైంది’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సంజయ్‌ వర్మ హీరోగా, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు సురేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమటం కుమార్‌ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టి. రమేష్‌ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తమటం కుమార్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు.

నటుడు సురేష్‌ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సంజయ్‌కి కెరీర్‌ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి’’ అన్నారు. ‘‘ఒక చిన్న విరామం, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రాల్లో హీరోగా నటించిన సంజయ్‌ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు తమటం కుమార్‌ రెడ్డి. ‘‘సమాజంలో జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది చేస్తున్న కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది’’ అన్నారు సాయికృష్ణ కేవీ.

Advertisement
 
Advertisement
Advertisement