Radhe Shyam Vs The Kashmir Files: రాధేశ్యామ్‌కు ఆ చిత్రం పోటీ ఇవ్వనుందా ?

Is The Kashmir Files Will Beat Prabhas Radhe Shyam Movie - Sakshi

Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్‌'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్‌' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది 'రాధేశ్యామ్‌'.

చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

కాకపోతే ప్రభాస్‌ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్‌'. తర్వాత మిక్స్‌డ్‌ పబ్లిక్‌ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్‌ మాత్రం మిక్స్‌డ్‌ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

చదవండి:  ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'.. సినిమాలో ఏముంది ?

ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్‌ వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి  దర్శకత్వం వహించారు. అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి వంటి పాపులర్‌ యాక్టర్స్‌ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్‌ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్‌ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. 

కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్‌'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్‌'ను 'ది కశ్మీర్ ఫైల్స్‌' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్‌ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్‌ స్టార్‌డమ్‌, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్‌ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' రీచ్‌ అవుతుందా ?.. లేదా బీట్‌ చేస్తుందా ? చూడాలి.

చదవండి: డైరెక్టర్‌ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top