Radhe Shyam OTT Release: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Is Radhe Shyam Streaming On Amazon Prime After 4 Weeks Theatrical Release - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. 

చదవండి: సూపర్‌ హిట్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్‌

1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ క్లాసీ లవ్‌స్టోరీ ఓ వర్గం​ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీ మళ్లీ మళ్లీ చూడాలని వారంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిందరిని సంతోష పెట్టే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతొంది. బిగ్‌స్క్రీన్‌పై సందడి చేస్తోన్న ఈమూవీ త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. రాధేశ్యామ్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, అందులో ప్రభాస్‌ మూవీ కావడంతో పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయట.

చదవండి: ‘రాధేశ్యామ్‌’ మూవీ ఎలా ఉందంటే..

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైం భారీ ఒప్పందానికి రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక ఏ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు వస్తుంది. అంటే రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలి. కానీ ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని అమెజాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top