తండ్రి, కొడుకుల మధ్య ఎమెషనల్‌ స్టోరీ.. సినిమాకు శ్రీకారం

Karthik Rathnam Hrithika Srinivas Movie Launch In Vizag - Sakshi

Karthik Rathnam Hrithika Srinivas Movie: బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో  శ్రీ  శ్రీనివాస స్క్రీన్స్  బ్యానర్ పై కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కార్తిక్ రత్నం, హ్రితిక శ్రీనివాస్, పృథ్వీ (పెళ్లి సినిమా ఫేమ్‌), కాలకేయ ప్రభాకర్, మహేంద్రనాద్, సిఎంఆర్. శర్మ, కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి  దర్శకుడుగా పరిచయమవుతున్నారు. బెక్కం రవీందర్  నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం (జులై 10) ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  స్టార్ మేకర్ సత్యానంద్.. చిత్ర హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం  వహించారు. 

పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాత బెక్కం రవీందర్  మాట్లాడుతూ.. 'స్టార్ మేకర్ సత్యానంద్  ఎంతో బిజీగా  ఉన్నా  మేము అడిగిన వెంటనే మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కొత్తవారైనా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్, సన్ ల మధ్య జరిగే ఏమోషనల్, క్రైమ్ కామెడీ స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి పది రోజులు వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్స్ లలో షూటింగ్ నిర్వహిస్తాం. ఆ తరువాత జరిగే రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేస్తాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మా సినిమాకు చాలా చక్కగా కుదిరారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top