‘‘అంత్య​క్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’

Karanvir Bohra Called Gareeb Arriving At Sidharth Shukla Home In Ciaz - Sakshi

Karanvir Bohra Arriving Sidharth Shukla Home In A Ciaz: బాలీవుడ్‌ యువ నటుడు  సిద్ధార్థ్‌ శుక్లా సెప్టెంబర్‌ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ‘‘ఇక స్నేహితుడు మృతి చెంది.. బాధలో ఉంటే.. పాపరాజీలు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తాము ఎలాంటి కార్లలో వచ్చాం.. అందంగా ముస్తాబయ్యామా లేదా వంటి అంశాలపై తమని విమర్శిస్తూ వార్తలు రాస్తున్నారని.. వారి నీచ మనస్తత్వానికి జాలి పడుతున్నాను’’ అన్నారు నటుడు కర్ణవీర్‌ బోహ్రా. 

విషయం ఏంటంటే సిద్ధార్థ్‌ శుక్లా మరణం అనంతరం కర్ణవీర్‌ బోహ్రా అతడిని తల్లిని పరామర్శించేందుకు సిద్ధార్థ్‌ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో కర్ణవీర్‌ సియాజ్‌ కార్‌లో సిద్ధార్థ్‌ నివాసానికి వచ్చాడు. ఇది చూసి పాపరాజీలు సియాజ్‌ కారులో వచ్చాడు.. పేదవాడిగా మారాడు అంటూ కామెంట్‌ చేయసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోని కర్ణవీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 
(చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?)

దీనిలో అతడు ‘‘కుమారుడిని కోల్పోయి కుంగిపోతున్న తల్లిని చూడటానికి మేం వెళ్లాం. ఇలాంటి విషాద సమయంలో కొందరు పాపరాజీలు చాలా దారుణంగా మాట్లాడారు. ఇంత బాధలో కూడా మేం ఫైవ్‌స్టార్‌ అప్పియరెన్స్‌తో కనిపించాలా.. కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా.. సియాజ్‌ కారులో వచ్చినందుకు నేను పేదవాడిని అయ్యానా.. ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరు’’ అంటూ ఘాటుగా విమర్శించాడా కర్ణవీర్‌ బోహ్రా. (చదవండి: సిద్దార్థ్‌పై జోక్‌ చేసిన సల్మాన్‌, పాత వీడియో వైరల్‌)

కర్ణవీర్‌ బోహ్రా తన భార్యతో కలిసి సిద్ధార్థ్‌ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాక.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్ధార్థ్‌ మరణంపై స్పందిస్తూ కర్ణవీర్‌ ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను చాలా  షాక్‌లో ఉన్నాను. ఇది ఎలా జరిగింది. దేవుడు మనతో ఇలాంటి జోక్‌లు చేయడం దారుణం. అతడి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. (చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్‌ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top