Karan Kundrra Marriage: పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ జంట

Karan Kundrra opens up on marrying Tejasswi Prakash this year - Sakshi

బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా.. బిగ్ బాస్ విన్నర్ తేజస్వీ ప్రకాశ్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు కుంద్రా. గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ఏడాది పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. బిగ్‌బాస్-2015 సీజన్‌లో  తేజస్వి, కరణ్ ప్రేమలో పడ్డారు.

వచ్చే నెలలోనే తేజస్విని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కరణ్ వెల్లడించారు. ఇటీవల తన కొత్త షో 'తేరే ఇష్క్ మే ఘయాల్' ప్రమోషన్ల సందర్భంగా పెళ్లిపై స్పందించారు. మా పెళ్లికి ఇప్పటికే కుటుంబ సభ్యులు అంగీకరించారని తెలిపారు. గతేడాదిలోనే పెళ్లి చేసుకోవాలన్నప్పటికీ కుదరలేదని అన్నారు. తేజస్వి ప్రకాశ్ 'నాగిన్ 6'కి షోతో బిజీ అయిపోయిందని పేర్కొన్నారు.

కరణ్-తేజస్వి లవ్ స్టోరీ

తేజస్వి ప్రకాష్ స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్ సీరియల్‌తో రాగిణి మహేశ్వరి పాత్రలో మంచి పేరు సంపాదించింది. ఆమె 2021లో బిగ్ బాస్- 15లో పాల్గొని విజేతగా నిలిచింది. తేజస్వి,  కరణ్ 2021లో 'బిగ్ బాస్ 15' హౌస్‌లో కలుసుకున్నారు. హోస్‌లోనే పరిచయమై చివరికి పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. తేజస్వి ప్రకాష్ 11 జూన్ 1993న జన్మించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top