Tejasswi Prakash: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం

Karan Kundrra Opens Up on Marriage, Reveals Tejasswi Prakash Wants Many Kids - Sakshi

Karan Kundrra: హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ చూసినవాళ్లకు కరణ్‌ కుంద్రా, తేజస్వి ప్రకాశ్‌ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో లవ్‌ జర్నీ కొనసాగించిన ఈ జంట బయటకు వచ్చాక వర్క్‌ షెడ్యూల్స్‌తో బిజీ అయిపోయింది. అయితే ఇటీవల తేజస్వి ఇంటికి తన పేరెంట్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన కరణ్‌ కుంద్రా నుదుటన కుంకుమతో బయటకు రావడంతో వీరికి రోకా అయిపోయిందని ఫిక్స్‌ అయ్యారు నెటిజన్లు. ప్రస్తుతం పని మీద దృష్టి పెట్టిన వీళ్లిద్దరూ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో లేనట్లు కనిపిస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ కుంద్రా మాట్లాడుతూ.. మంచి భర్తగా కంటే కూడా మంచి తండ్రిగా ఉండగలనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. తనకు పెళ్లైతే మాత్రం ముందుగా ఓ ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానన్నాడు. తామిద్దరికీ సుమారు 25 మంది పిల్లలను కనాలని ఉందని వ్యాఖ్యానించాడు. కాగా తేజస్వి ప్రకాశ్‌ ప్రస్తుతం నాగిని 6 సీరియల్‌లో నటిస్తోంది. కరణ్‌ కుంద్రా లాకప్‌ షోలో పాల్గొన్నాడు.

చదవండి: ఓటీటీలో రిలీజ్‌ కానున్న స్టార్‌ హీరోయిన్‌ సినిమా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top